హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బెజ్జంకిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి'

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బత్తుల అభిషేక్‌భాను ప్రభుత్వాన్ని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ విద్య కోసం పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు.