హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 9న సర్వసభ్య సమావేశం

విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని సెప్టెంబర్ 9న నిర్వహించనున్నారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఈ సమావేశం జరుగుతుందని జడ్పీ CEO ఎ.లవరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.