హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

VZM: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పీఆర్‌సీ, పింఛనదార్లకు క్వాంటం పెన్షన్ మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి ఏపీఎన్జీవో నాయకులు పాలాభిషేకం చేశారు. కొత్తవలస ఎన్జీవో కార్యాలయం వద్ద థ్యాంక్ యూ సీఎం సార్ అని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ ఛైర్మన్ జె. వి.ప్రసాదరావు, కార్యదర్శి కుమార్, ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.