హైదరాబాద్: 28°C
తెలంగాణ

MBBS సీటు సాధించిన యువతికి సన్మానం

VKB: ఎన్కతల గ్రామానికి చెందిన పేద కుటుంబ యువతి సంజన కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ ఆమెను ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల మల్లేశం శాలువాతో సత్కరించి, అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేశారు.