ADB: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులకు 4 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. కార్మికులను విద్యాశాఖ ఉద్యోగులుగా గుర్తించి, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ
'స్వచ్ఛ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి'


