MLG: ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ యూఆర్జేసీ పాఠశాలలో విద్యార్థులతో ప్రిన్సిపల్ కిరణ్మయి కాళ్లు నొక్కించుకుంటున్నారంటూ విద్యార్థినులు ఆరోపించారు. సెలవు రోజుల్లో కాళ్లు నొక్కాలని తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే తమను టార్గెట్ చేసి వేధిస్తారనే భయంతో చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'మాతో కాళ్లు నొక్కించుకుంటున్నారు'


