హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజే మోతతో ప్రమాదం.. పోలీసుల హెచ్చరిక

ADB: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యువత డీజే సౌండ్లకు దూరంగా ఉండి సాంప్రదాయ వాయిద్యాలను వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. గత సంవత్సరం ఓ వేడుకల్లో వేర్వేరు ప్రాంతాల్లో డీజే అధిక శబ్దం కారణంగా ఇద్దరు మహిళలు గుండెపోటుతో మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో డీజే వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.