BHPL: ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 75 దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి, వారంలోగా పరిష్కరించి చర్యల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్


