హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఎస్సైలుగా నలుగురికి పదోన్నతి

JGL: జిల్లాలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న మల్లారెడ్డి, మునియ్య, నసీర్‌ ఖాన్, ఇలియాస్‌ అహ్మద్‌లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. సోమవారం ఎస్పీ అశోక్‌ కుమార్‌ వీరికి స్టార్లు అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతితో బాధ్యత పెరుగుతుందని, నిజాయితీతో విధులు నిర్వర్తించి ప్రజల్లో పోలీస్‌ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు.