హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోపాలపురం ఎమ్మెల్యేకు సీఎం అభినందనలు

E.G: అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్స్ కాంక్లేవ్‌లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్-5 నియోజకవర్గాల్లో గోపాలపురం నియోజకవర్గం నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజును అభినందించారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు.