హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బోర్‌వెల్‌ను మరమ్మతు చేయాలి'

ASR: డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ సరియవలస గ్రామంలో నెల రోజులుగా పనిచేయని తాగునీటి బోర్‌వెల్‌ను వెంటనే మరమ్మతు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సుమారు 50 కుటుంబాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. సోలార్‌ ద్వారా నీటి సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో సమస్య తీవ్రంగా ఉందన్నారు.