హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాదంపూడిలో ఓటర్ల తుది జాబితా ప్రకటన

ELR: ఉంగుటూరు (M) బాదంపూడి పంచాయతీకి సంబంధించిన SC/ST/BC ఓటర్ల తుది జాబితాను పంచాయతీ కార్యదర్శి కె.వి. గిరిధర్ సోమవారం ప్రచురించారు. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ తుది జాబితాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. తుది జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించారు. ఇదే ఫైనల్ జాబితా అని, ఇకపై ఎలాంటి సవరణలు ఉండవన్నారు.