హైదరాబాద్: 28°C
తెలంగాణ

టైగర్ జోన్ ఎత్తివేయాలని వినతి పత్రం సమర్పణ

MNCL: ప్రజలకు నష్టం చేస్తున్న టైగర్ జోన్ ఎత్తివేయాలని సామాజిక పోరాట సమితి జన్నారం మండల నాయకులు కోరారు. సోమవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని ఎఫ్డీఓ కార్యాలయంలో స్థానిక FDO రామ్మోహన్ కుమార్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభయారణ్యంలో పులి రాకున్నా ఆంక్షలు విధించడంతో అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.