KDP: సిద్ధవటం మండలం బాకరాపేట సమీపంలోని పరమాత్మ సేవా వృద్ధాశ్రమం ప్రాంగణంలో వెలసిన శ్రీ ఆది భిక్షు అన్నపూర్ణాదేవి ఆలయ రెండో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుడు సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో గణపతి పూజ, నవగ్రహ మంటపారాధన, లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, రుద్ర హోమం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఆది భిక్షు అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు


