అన్నమయ్య: పశుపోషకులకు రాష్ట్ర ప్రభుత్వం పశు బీమా ప్రీమియంలో 85 శాతం రాయితీ కల్పిస్తోందని రామాపురం పశువైద్యాధికారి డా.మధుసూదన్ తెలిపారు. ఆరు నెలలు నిండిన మేకలు, గొర్రెలకు ఈ సౌకర్యం వర్తిస్తుందని, యజమానులు కేవలం 15 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల పశుపోషకులు సమీప పశువైద్యశాలను సంప్రదించి బీమా చేయించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పశు బీమా ప్రీమియంలో 85 శాతం రాయితీ'


