హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ ఎన్నికలకు దూరంగా రాజమండ్రి

E.G: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌లో 2019 నుంచి ప్రత్యేక పాలన కొనసాగుతోంది. 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో ఇప్పటి వరకు ఎన్నికైన ముగ్గురు మేయర్లు TDPకి చెందినవారే. 2000లో MS చక్రవర్తి తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. 2007లో ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, 2014లో పంతం రజనీ శేషసాయి మేయర్లుగా పనిచేశారు. 2019 నుంచి గ్రామాల విలీన వివాదం కోర్టులో ఉండడంతో ఎన్నికలు జరగలేదు.