హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆచంటలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

WG: ఆచంటలో సోమవారం వేసవిని తలపించేలా భానుడు ప్రతాపం చూపించడంతో 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సెప్టెంబర్ నెలలోనూ తీవ్రమైన ఎండ, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రతకు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండ వేడిమి దృష్ట్యా వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.