హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పత్తికొండను కరువు మండలంగా ప్రకటించాలి'

KRNL: పత్తికొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని కోరారు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేసి ఉచిత పంట బీమా అమలు చేయాలని డిమాండ్ చేసారు. సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.