హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామ PGRSకు 15 ఫిర్యాదులు

నందిగామలో సోమవారం ఆర్డీవో జి. అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 15 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూకు 10, విద్యుత్‌కు 2, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, పోలీస్ శాఖలకు ఒక్కో ఫిర్యాదు ఉన్నాయి. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీవో అధికారులను ఆదేశించారు.