నెల్లూరులోని వేదాయపాలెం సీఐగా చిట్టెం కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో చిన్నబజారు, సంతపేట, బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్లలో సీఐగా విధులు నిర్వహించారు. ఆయా స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. వారితో కఠినంగా వ్యవహరించారు. నూతన సీఐకు స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వేదాయపాలెం సీఐగా కోటేశ్వరరావు


