హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీఎస్సీ అక్రమాలపై చర్చకు రావాలి'

VSP: మెగా డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 13న విశాఖలో బహిరంగ చర్చకు రావాలని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ సోమ‌వారం డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఇందులో సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని లోకేష్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు.