హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాజకుమారి

నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వారు ఆమెకు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం ప్రజలనుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.