హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

ELR: ఆటో, క్యాబ్, లారీ, అంబులెన్స్ ఇతర మోటార్ రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీవో నంబర్లు 21, 31లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ-చలానాల వేధింపులు ఆపాలన్నారు.