TPT: మట్టి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. తిరుపతిలో వినాయక చవితి పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. నిమజ్జనం సమయంలో నీటి కాలుష్యం, జలచరాలకు హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినాయకుడి రూపంలో విజ్ఞానం, ఏకాగ్రత, పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వం వంటి ఎన్నో జీవిత పాఠాలు ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి విగ్రహాలను పూజించండి: మంత్రి


