హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శుభ్రమైన గాలిపై అవగాహన ర్యాలీ..!

KDP: అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదనపు కమిషనర్ కె. రాకేష్ చంద్రతో పాటు నగరపాలక సంస్థ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. అక్కాయపల్లి ప్లాజా సమీపంలో నిర్వహించిన ర్యాలీలో శుభ్రమైన గాలి, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.