హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ దేశ మాజీ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సొంత దేశం కోసం కోచ్‌గా పనిచేయాలని ఉన్నప్పటికీ, బోర్డు తీసుకునే ఆకస్మిక నిర్ణయాలు, గౌరవం లేని వాతావరణం చూస్తుంటే పనిచేయడానికి భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పర్యటన మధ్యలోనే కోచ్‌లు, ఆటగాళ్లను తొలగించడం వల్ల ఉద్యోగ భద్రత కరువైందని ఆయన విమర్శించాడు.