ASR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలకు టీడీపీ ఎన్నికల ఇన్‌ఛార్జులను నియమించింది. ఇందులో భాగంగా అల్లూరి జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌ను నియమించింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, పార్టీ శ్రేణులు, నేతలను క్రియాశీలం చేయడాన్ని ఆయన పర్యవేక్షించనున్నారు. కూటమి పార్టీల సమన్వయం, ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా రాజశేఖర్


