W.G: కొత్త భరోసా పెన్షన్ల దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం ఉంగుటూరు మండలంలో అన్ని గ్రామసచివాలయాలు పెన్షన్ దారులతో కిటకిటలాడాయి. ఉంగుటూరు గ్రామ సచివాలయంలో ఉదయం నుంచే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మండలంలోని అన్ని పంచాయతీల పరిధిలో సచివాలయ సిబ్బంది దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ దారులతో కిటకిటలాడిన సచివాలయం


