హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నీటిని తాగేదేలా ?

GNTR: గుంటూరు సంగడిగుంట పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీ, బాపూజీనగర్‌లలో వారం రోజులుగా తాగునీటిలో మురుగునీరు కలిసి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ కలుషిత నీటితో డయేరియా ప్రబలి ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.