హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారికి స్వర్ణగిరి బాలాజీ అవార్డు

NRML: నిర్మల్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి గుర్రం సంహిత భరతనాట్యంలో ప్రతిభ చాటింది. స్వర్ణగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో సంహిత ‘స్వర్ణగిరి బాలాజీ అవార్డు’ను అందుకుంది. మహిత, ప్రణయ్ దంపతుల కుమార్తె అయిన సంహిత హావభావాలు, అభినయంతో భక్తి భావాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ఆమె నృత్యం సభికులను విశేషంగా ఆకట్టుకుంది.