హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

తిరుమల ట్రాఫిక్ ఎస్సై ఆధ్వర్యంలో, PAC 3 వద్ద ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ప్రయాణికుల భద్రత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ తదితర అంశాలపై ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. సురక్షిత ప్రయాణం-బాధ్యతాయుత డ్రైవింగ్ మనందరి బాధ్యత అని సూచించారు.