హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి ప్రాబబుల్స్‌కు మధు హంసిని ఎంపిక

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళల అండర్‌-19 క్రికెట్ ఎంపికల్లో షాద్‌నగర్‌కు చెందిన మధు హంసిని రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యారు. ఇంట్రో 21 క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆమె ప్రతిభను కోచ్ జ్ఞానేశ్వర్, నిర్వాహకులు అభినందించారు. త్వరలో జరిగే మ్యాచ్‌లలోనూ రాణించి తెలంగాణ జట్టులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు.