హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి'

ADB: గర్భిణీ మహిళలు, చిన్నారులు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సిబ్బంది సూచించారు. సోమవారం బోథ్ మండలంలోని మంద బొగడ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రోజువారి ఆహారంలో కూరగాయలు, పాలు, పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, సిబ్బంది పాల్గొన్నారు.