MNCL: జన్నారం మండలంలోని బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ BJP ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో జన్నారం మండలానికి చెందిన బీజేవైఎం నాయకులు ముడుగు ప్రవీణ్‌తో పాటు పలువురిని పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ
బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్


