హైదరాబాద్: 28°C
క్రీడలు

లబుషేన్‌కు మరో అవకాశం

సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు సెలక్టర్లు మరో అవకాశం కల్పించారు. 2023 నుంచి మూడంకెల స్కోర్ సాధించనప్పటికీ, అతడిపై నమ్మకంతో జట్టులో చోటునిచ్చారు. ఈ సిరీస్‌లోనూ విఫలమైతే మాత్రం వేటు పడే అవకాశముంది.