హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఇంజెరిలో పీజీఆర్ఎస్

ASR: పెదబయలు మండలం ఇంజెరిలో సోమవారం (నేడు) నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్యామ్ సుందర్ తెలిపారు. ఆదివాసీలు తమ సమస్యలపై వినతులు అందజేయవచ్చని చెప్పారు. అర్జీలను అధికారులు సకాలంలో పరిష్కరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు.