SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వేకువజామున ప్రత్యేక పూజలు చేపట్టారు.ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు


