కోనసీమ: జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పశగొడుగుల బాలవెంకట శివకిషోర్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.32 లక్షలు కాజేశారని భార్య కాయల మాధురి ఆదివారం అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన చెక్కుపై సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సంతకం ఫోర్జరీ చేసి రూ.32 లక్షలు డ్రా..!


