SRPT: గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయవద్దని, అలా చేయడం వల్ల రాకపోకలకు, అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. మండపాల ఏర్పాటుకు ముందుగా పోలీస్ అనుమతి తీసుకుని వారికి సమాచారం అందించాలన్నారు.
తెలంగాణ
'రోడ్లపై గణేష్ మండపాలు ఏర్పాటు చేయవద్దు'


