హైదరాబాద్: 28°C
వ్యాపారం

యూపీఐ, అలీపే ప్లస్ డీల్‌కు బ్రేక్

'యూపీఐ'తో అనుసంధానం కావడానికి చైనాకు చెందిన యాంట్ గ్రూప్ అనుబంధ సంస్థ 'అలీపే ప్లస్' ప్రతిపాదనకు కేంద్రం బ్రేక్ వేసింది. జాతీయ భద్రత, వినియోగదారుల డేటా నిల్వ, దుర్వినియోగం అయ్యే ముప్పు ఉందనే ఆందోళనలతో ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆసియా దేశాల్లోని 15 కోట్లకు పైగా వ్యాపారుల వద్ద సులభంగా యూపీఐ చెల్లింపులు చేసేలా జనవరిలో ఈ ప్రతిపాదన తెచ్చింది.