హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?

టాటా సన్స్ ఛైర్మన్ N.చంద్రశేఖరన్ పదవీకాలం 2027 ఫిబ్రవరిలో ముగియనుండటంతో కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. తదుపరి ఛైర్మన్ రేసులో అంతర్గత అభ్యర్థులైన టాటా స్టీల్ CEO టీవీ నరేంద్రన్, CFO సౌరభ్ అగర్వాల్‌తో పాటు అనూహ్యంగా NSE సీఈఓ ఆశిష్ చౌహాన్ పేరు తెరపైకి వచ్చింది. ఎంపిక ఆలస్యమైతే నోయల్ టాటా తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.