హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఏకే-203 రైఫిళ్లకు మందుగుండు సామగ్రి సరఫరా

ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లకు స్వదేశీ 7.62/39 ఎంఎం మందుగుండు సామగ్రిని సరఫరా చేయడానికి ఇండో-రష్యన్ రైఫిల్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌తో అదానీ డిఫెన్స్ ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ కోర్వా కేంద్రంలో తయారవుతున్న ఈ రైఫిళ్లకు అవసరమైన మందుగుండును అదానీ సంస్థ అందించనుంది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో ఆత్మనిర్భరత మరింత బలపడనుంది.