హైదరాబాద్: 28°C
వ్యాపారం

జాగ్వార్ కంపెనీలో భారీగా లేఆఫ్స్

టాటా మోటార్స్ అనుబంధ లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. యూకేలోని తమ విభాగాల్లో వచ్చే రెండేళ్లలో 4,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ కోత ప్రధానంగా ఆఫీస్, మేనేజ్‌మెంట్ సిబ్బందికే వర్తించనుంది. తగ్గుతున్న అమ్మకాలు, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా సంస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది.