హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వర్షాకాలంలో ముల్లంగి తింటున్నారా?

జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కాలేయాన్ని శుభ్రపరచడంలో ముల్లంగి తోడ్పడుతుంది. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ కాస్త మందగిస్తుంది. ముల్లంగిలో ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణక్రియ సులభంగా జరిగేలా చూస్తుంది. ముల్లంగికి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడంలో పనిచేస్తుంది. విటమిన్ సీ, ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.