హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

VSP: జిల్లాలో ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. అర్హత కలిగిన వారు నిర్దేశిత ఫారాన్ని పూరించి వార్డు కార్యాలయంలో అందజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.