హైదరాబాద్: 28°C
క్రీడలు

ట్రై సిరీస్ విజేతగా సౌతాఫ్రికా

జింబాబ్వే, నమీబియాలతో జరిగిన ట్రై సిరీస్‌ను సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. విండ్‌హొక్ వేదికగా జరిగిన ఫైనల్‌లో సౌతాఫ్రికా 48 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. తొలుత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే 18 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. హెర్మన్ అర్ధశతకంతో రాణించగా, బ్రాడ్ ఎవన్స్ పోరాటం జట్టును గెలిపించలేకపోయింది.