హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు సమస్య పరిష్కరించాలి'

పార్వతీపురం పట్టణంలోని 26వ వార్డు పండా వీధిలో అధ్వానంగా మారిన రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని బీసీ వెల్ఫేర్ ఇంఛార్జ్ బెలగాం చంద్రశేఖర్ కోరారు. రెండో పైపులైన్ పనుల కోసం మూడేళ్ల క్రితం చేపట్టిన తవ్వకాలు పూర్తికాకపోవడంతో రహదారి గుంతలమయంగా మారిందన్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.