హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, పాదరక్షల పంపిణీ

అన్నమయ్య: రాయచోటి పురపాలక సంఘంలో 160 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, పాదరక్షలు, కొబ్బరి నూనె, సబ్బులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం అవసరమైన సామగ్రి అందించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను మంత్రి అభినందించారు. పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.