NLR: నెల్లూరు జీజీహెచ్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జేఏసీ నాయకులు శేషగిరిరావు, శరత్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్నా రెగ్యులర్ చేయలేదని తెలిపారు. కాంట్రాక్ట్ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన


