హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మద్యం విక్రేత అరెస్ట్

PPM: బాలేరు గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న రహీం అనే వ్యక్తిని బత్తిలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో అతని వద్ద నుంచి 32 ఆఫీసర్ ఛాయస్ క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.